Friday, July 11, 2025
E-PAPER
Homeఖమ్మంవారికే రైతు భరోసా.!

వారికే రైతు భరోసా.!

- Advertisement -

గిరిజన రైతులే అధికం..
ద్వితీయ స్థానంలో ఇతరులు..
మూడో స్థానంలో దళితులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అటవీ ప్రాంత లో నివశించే గిరిజనులు, నిమ్న, అణగారిన, దళిత సామాజిక వర్గాల ప్రజలు నేటికీ అట్టడుగునే ఉన్నారు. ఇందుకు కారణం సామాజిక బరోసా, ఆర్ధిక సాధికారత హోదా కల్పించే స్థిర ఆస్తి అయిన భూమి వారి చేతుల్లో లేకపోవడమే దీనికి కారణం.  ఈ ప్రాంతంలో మూల వాసులు అయిన గిరిజనులు తర్వాత దళితులే అని చెప్పడానికి ఆధారాలు అవసరం లేదు.అయినా గిరిజనేతర,దళితేతరులైన వేరే సామాజిక వర్గాల వద్దే భూమి ఉండటం ఆశ్చర్యం.

అశ్వారావుపేట నియోజక వర్గంలో భూమి కలిగిన వారిలో గిరిజనులు తర్వాత అత్యధికులు ఇతరు లే ఉన్నారు.కానీ సామాజికంగా అట్టుడుగు న ఉన్న దళితుల్లో భూమిలేని నిరుపేద లే అధికం. విశ్వసనీయ సమాచారం ప్రకారం రైతు బరోసా నివేదికలు ఆధారంగా గిరిజన నియోజక వర్గం అయిన అశ్వారావుపేట లో ఏ సామాజిక వర్గం రైతులు ఎంతమందో వారి శాతం ఎంతో వారి స్థానాలు తెలుపుతున్నాయి.

నియోజక వర్గం వ్యాప్తంగా 5 మండలాల్లోని సామాజిక వర్గాల వారీగా రైతుల వివరాలు.

మండలం         ఎస్సీ      ఎస్టీ      ఓసీ        మొత్తం
అన్నపురెడ్డిపల్లి  159     2018    2891     5068
అశ్వారావుపేట   350    8626    4526   13502
చండ్రుగొండ        219    3671    2412     6302
దమ్మపేట           253    6680    5266    12199
ములకలపల్లి     132     9177   1625    10934
మొత్తం           1113   30472  16720   48005

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -