Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి 

హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి 

- Advertisement -

– ఎర్రయ్య పసర పోలీస్ స్టేషన్ సెకండ్ ఎస్ఐ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
ద్విచక్ర వాహనదారులు ఎంతో రక్షణాత్మకమైన హెల్మెట్ ను ధరించే విషయంలో అవగాహన పెంపొందించుకొని ప్రమాదాలను నివారించుకోవాలని పసర పోలీస్ స్టేషన్ సెకండ్ ఎస్ఐ ఎర్రయ్య అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారిపై వెహికల్ చెకింగ్ నిర్వహణలో పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎర్రయ్య మాట్లాడుతూ ప్రయాణంలో సురక్షితంగా ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి చేరేవరకు హెల్మెట్ ధరించి ఉండాలని అన్నారు. ఇటీవల కాలంలో హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలలో పలువురు మృతి చదడం జరిగిందని పేర్కొన్నారు. మీకోసం మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం వారి ఎదురుచూపు కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేనియెడల ఉపేక్షించేది లేదని అన్నారు. హెల్మెట్ ధరించని వారికి ఫైన్ తో పాటు శిక్ష కూడా ఉంటుందని అన్నారు. మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం జరగకూడదని, ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసి రతన్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -