Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆవాజ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి: అబ్బాస్

ఆవాజ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి: అబ్బాస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూలై 13, 14 తేదీలలో గద్వాలలో జరుగు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన సంఘం బ్రోచర్ ను వివిధ జిల్లాల ఆవాజ్ నాయకులతో కలిసి అబ్బాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మహాసభలకు ఆఖిల భారత నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు సుభాషిణి అలీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు, 33 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరై మైనారిటీల ఆర్థిక, సామాజిక, సంస్కృతిక సమస్యలపైన, లౌకికవాదం, మత సామరస్యం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తారని అన్నారు.


దేశంలో నానాటికి మత ఉన్మాదం పెరిగిపోతున్నదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే ఒక మతస్థులపై మరొక మతస్థులను ఉసిగొల్పి, పరస్పరం అపనమ్మకం, ఆక్రోశాన్ని పెంచుతున్నారని విమర్శించారు. మనసులను మతం ఆధారంగా చూసే ధోరణి పెరుగుతుంది, ఇది ఎంత మాత్రం సరైనది కాదన్నారు. వైవిధ్యభరితమైన సంస్కృతి గల భారతదేశ ఔన్నత్యాన్ని, మతసామరస్యాన్ని, కాపాడుకోవాలంటే ఈ రకమైన మతోన్మాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

సమాజం స్పందించి సెక్యులరిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. మత ఉన్మాదాన్ని పెంచే దిశగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టగ్రామ్, యూట్యూబ్, ఇతరత్రా సోషల్ మీడియా, ప్రధాన ప్రచార మాధ్యమాలలో అసత్యాలు, అబద్ధాలతో కూడిన విద్వేష విషం చిమ్మడం, వార్తలు రాయడం, పరిపాటిగా మారిందని, ప్రజలు ఇటువంటి వార్తలను చదివి, విని వాస్తవాలు తెలుసుకోకుండానే ఉద్వేగానికి గురవుతున్నారని అన్నారు. ఈ విష సంస్కృతిని నిర్మూలించడానికి అన్ని మతాలలోని పెద్దలు, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం అడుగులు వేయాలని అందుకోసం ఆవాజ్ కమిటీ కృషి చేస్తుందని, ఆ కృషిలో భాగంగా గద్వాలలో రాష్ట్ర మహాసభలు జరపాలని తీర్మానించుకున్నదని అన్నారు.

ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మతసామరస్యం, సెక్యులరిజం అజెండాగా రాజ్యాంగ పరిధిలోను, రాజ్యాంగ పీఠికలో మనం ఏర్పరచుకున్న సెక్యులరిజం దిశగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ, నిర్మల్ జిల్లా నాయకులు ఫషియుద్దీన్, దాదేమియా, హైదరాబాద్ నాయకులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad