Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐదో విడతలో సుదీర్ఘంగా..

ఐదో విడతలో సుదీర్ఘంగా..

- Advertisement -

– ఎనిమిది గంటలపాటు సాగిన ప్రభాకర్‌రావు విచారణ
– అప్పటి డీజీపీలు చెబితేనే ఫోన్‌ట్యాపింగ్‌లు జరిపాం
– పదే పదే వెల్లడించిన మాజీ ఐజీ
– తిరిగి విచారణకు పిలుస్తామని సిట్‌ ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావును శుక్రవారం ఐదో విడత సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఈ సారి సైతం ప్రభాకర్‌రావు నుంచి ఫోన్‌ట్యాపింగ్‌ జరపటానికి వెనుక అప్పటి పొలిటికల్‌ బాస్‌ల హస్తం ఉందా? అనే విషయంలో మాజీ ఐజీ నుంచి నిర్ధిష్టమైన సమాధానాన్ని సిట్‌ అధికారులు రాబట్టలేక పోయారని తెలిసింది. అయితే, అప్పటి పోలీసు బాస్‌లైన డీజీపీలు అంజనీకుమార్‌, మహేందర్‌రెడ్డిల ఆదేశాలతో పాటు వారి అనుమతుల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌లను సాగించినట్టు ప్రభాకర్‌ రావు సిట్‌ అధికారులకు వెల్లడించా రని సమాచారం. ఇదే విషయాన్ని ఇంతకముందు తెలిపిన ప్రభాకర్‌రావు తాజాగా కూడా పదే పదే ప్రస్తావించినట్టు తెలిసింది.
ఈ కేసులో నిందితులు, వాంగ్మూ లాలిచ్చినవారి రికార్డులను ప్రభాకర్‌ రావు ఎదుట ఉంచి ఫోన్‌ట్యాపింగ్‌లకు పూర్తిగా మీ బాధ్యతే అని వారిచ్చిన సాక్ష్యాలు నిజం కావా? అని ప్రశ్నించి నప్పుడు.. అందులో అన్నీ నిజం కావు కదా అని ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఐదోరోజు కూడా ప్రభాకర్‌రావు ఇచ్చిన వాంగ్మూ లాన్ని సిట్‌ అధికారులు ఒక్క సెకండ్‌ కూడా పొల్లు పోకుండా వీడియో చిత్రీకరణ జరిపినట్టు తెలిసింది. తిరిగి మిమ్మల్ని విచారిస్తామని ఆయనను సిట్‌ అధికారులు పంపించివేశారు. ఇదిలా ఉంటే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు నుంచి కూడా ఈ కేసులో వాంగ్మూలాన్ని తీసుకోవాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆయనకు కూడా తమ ఎదుట హాజరు కావాలని సిట్‌ అధికారులు కోరనున్నారని తెలిసింది.
నా ఫోన్లూ ట్యాపింగ్‌ చేశారు : కాంగ్రెస్‌ నాయకుడు గోనె ప్రకాశ్‌రావు
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తన ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మెన్‌ గోనె ప్రకాశ్‌రావు శుక్రవారం సిట్‌ అధికా రుల ఎదుట హాజరై వాంగ్మూల మిచ్చాడు. అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిన పోలీసు అధికారులతో పాటు వారి వెనుక ఉన్నవారు ఎంత పెద్ద వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -