Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంIsrael-Gaza war: ఆకలేస్తే మట్టి తింటున్నాం..

Israel-Gaza war: ఆకలేస్తే మట్టి తింటున్నాం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కొన్ని వారాల కిందట ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులు పాలస్తీనా ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయటమే కాకుండా తినటానికి తిండి కూడా లేకుండా చేసింది. వందల మంది ఈ దాడుల్లో చనిపోవటం, తీవ్రంగా గాయపడటం తెలిసిందే. కనీస అవసరాలైన ఆహారం, వైద్యం కూడా అక్కడి ప్రజలకు అందటం లేదు.  ప్రస్తుతం గాజాలోని పరిస్థితులు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. ఆటబొమ్మలతో, బడి పాఠాలతో కాలం గడపాల్సిన చిన్నారులు కనీసం ఒక్క పూట ఆకలి తీరేందుకు ఏదైనా సాయం అందితే చాలు అని సరిపెట్టుకునే రోజులు అక్కడ కొనసాగుతున్నాయి.

మరో పక్క అక్కడి ప్రజలకు అందాల్సిన సాయం ట్రక్కులను ఉగ్రవాదులు అడ్డుకుని వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వందల మంది ఒక్క రొట్టెముక్క దొరికితే ఈ పూటకు చాలు దేవుడా అని వేడుకుంటున్నారు. గాజా ప్రాంతంలో కొనసాగుతున్న వాస్తవ పరిస్థితులపై ఒక బాలుడు మాట్లాడుతూ తమ దీన దుస్థితిని చెబుతున్న వీడియో ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రతి రోజూ తమకు ఆహారం వస్తుందని చెబుతున్నారే కానీ ఒక్క ట్రక్కు కూడా రావటం లేదని బాలుడు వాపోయాడు. తినటానికి తిండి లేక మట్టి తిని ఆకలి చంపుకుంటున్నామని బాలుడు వీడియోలో వెల్లడించాడు. తమపై దయచూపించాలని, తమకు కొంచెం తినటానికైనా సహాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఒక్క బ్రెడ్ ముక్క రూ.450కి అమ్ముతున్నారని చెప్పాడు.  బ్రెండ్ తినాల్సిన తాము మట్టి తింటున్నామంటూ చెప్పిన మాటలు కలిచివేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad