No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుకౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: ఎమ్మెల్యే వేముల

కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: ఎమ్మెల్యే వేముల

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి నోటీస్ లు లేకుండా శంషాబాద్ ఎయిర్ పోర్ట్  లో ఎమ్మెల్యే ను అరెస్ట్ చేసిన తీరు ఆక్షేపనీయమని తెలిపారు.ఇది ప్రజా పాలన కాదు రాచరిక పాలన, నియంత పాలన, ఎమర్జెన్సీ పాలన అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నింస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.రేవంత్ రెడ్డికి, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో ఉన్న  శ్రద్ధ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లేదని విమర్శించారు.అక్రమ కేసులతో అరెస్ట్ లు చేసి మా స్థైర్యాన్ని దెబ్బ తీయలేరని, మమ్మల్ని భయపెట్టలేరని పేర్కొన్నారు. మీరెన్ని అక్రమ కేసులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటమని, కోర్టులపై మాకు పూర్తి విశ్వాసము ఉందని స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad