Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు సన్మానం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని మోడల్ గ్రామమైన బంగారు పల్లీ లొ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మే రకు 1వంద ఐదు మంది లబ్ధిదారులను ఇందిరమ్మ గృహ పథకంలో గుర్తించడం జరిగింది. వీరిలో దాదాపుగా సగం పైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలో చేపడుతున్నారు. కొంతమంది ఇండ్ల నిర్మాణాలు స్లాబ్ లెవల్ వరకు ఉండగా ఇంకొంతమంది పునాది దశలో పిల్లర్స్ లెవెల్ దశలో, గోడ నిర్మాణాలు చేశారు.  నేటికీ లబ్ధిదారుల వారికి రెండు విడతలగా ఇందిరమ్మ పథకం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. శనివారం నాడు ఇందిరమ్మ పథకం గృహ నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ క్షేత్రస్థాయి పరిశీలన కు వెళ్ళినప్పుడు నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు . లబ్ధిదారులకు కావలసిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి సూచనలు చేయడం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారులు గృహ నిర్మాణాలు 90% పూర్తిగా నిర్మించుకున్న వారికి ఎంపీడీవో కార్యాలయం తరఫున ప్రోత్సాహంగా లబ్ధిదారులను గుర్తించి శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు స్థానిక గ్రామ పెద్దలు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad