Saturday, July 12, 2025
E-PAPER
Homeజిల్లాలుయోగాతో సంపూర్ణ ఆరోగ్యం.!

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.!

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
: నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్,మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రిన్స్ పాల్ తెలిపారు.ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాల, ప్రణాయమాలు విద్యార్థులచే చేయించి మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలన్నారు.యోగాతో మానసిక ప్రశాంత చేకురుతుందని,ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడించారు.యోగా 9సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు వరకు యోగాను ఎవరైన పటించ వచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -