Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బాలో అంతర్జాతీయ యోగ వేడుకలు

కస్తూర్బాలో అంతర్జాతీయ యోగ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్స కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలతో   యోగ, ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా కస్తూర్బా విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి  మాట్లాడుతూ యోగ మానవునికి ఎంతో అవసరమని, ప్రపంచ దేశాలు కూడా యోగ వైపు చూస్తున్నాయని విద్యార్థినిలకు తెలిపారు.యోగా అనేది భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగమని తెలిపారు. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్ని శారీరిక కదలికల (ఆసనాలు), శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారన్నారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయిక అని వివరించారు.  ప్రతిరోజు విద్యార్థులు యోగ కొరకు సమయం కేటాయించాలని, యోగ ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలిపారు.  

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad