మండల విద్యాధికారి ఎల్లయ్య
నవతెలంగాణ – కామారెడ్డి : ప్రయివేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య అన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం చేశారు. బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన స్పందన, హనుమాన్ మందిర్ హై స్కూల్ కు చెందిన గణేష్ అత్యధిక మార్కులు సాధించినందుకు వీరికి శాలువాలు కప్పి మెమొంటోళ్లు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాఫిట్ షూ కంపెనీ ఏరియా మేనేజర్ అంబాజీ, మేనేజర్ సతీష్, ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, సంజయ్ కుమార్, విజన్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్, సిబ్బంది అనిల్ కుమార్, హర్షవర్ధన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES