మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీ కొన్న బీఆర్ఎస్ కార్యకర్త..

నవతెలంగాణ-హయత్ నగర్ : ఓ బీ ఆర్ ఎస్ కార్యకర్త మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని డీ కొట్టిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 2పెట్రోల్ మొబైల్ టీ ఎస్ 09పీఏ 3688గల వాహనం హయత్ నగర్ లో ఉన్న మదర్ డెయిరీ వద్ద ఆగి ఉండడంతో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ కి చెందిన ఓ యువకుడు హయత్ నగర్ నుండి పసుమాములకు ద్వీ చక్ర వసహనంపై వెళ్తు మద్యం మత్తులో ఉండగా పోలీస్ వాహనాన్ని డీ కొనగా పూర్తిగా డ్యామేజ్ కావడంతో వెంటనే పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ చేపించగా 169పాయింట్లు వచ్చినట్లు తెలిసింది. ఇట్టి విషయంపై హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ను నవతెలంగాన వివరణ కోరగా డ్యామేజ్ అయిన వాహనానికి అయ్యే ఖర్చులు భరిస్తున్నాడని వెల్లడించారు.
Spread the love