Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కొండా మురళిపై చర్యలకు డిమాండ్ 

కొండా మురళిపై చర్యలకు డిమాండ్ 

- Advertisement -

టిపిసిసి ప్రెసిడెంట్ కు పరకాల కాంగ్రెస్ నేతల పిర్యాదు 
నవతెలంగాణ – పరకాల 
: కొండా మురళి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని న్యూ ఎమ్మెల్య క్వార్టర్స్ లోని తన నివాసంలో కలుసుకొని వినతి పత్రం అందించడం జరిగింది. వరంగల్ కేంద్రంగా జరిగిన రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలిసిందే.ఈ క్రమంలో శనివారం పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్,పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, గీసుకొండ మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్, సంగెం మండల అధ్యక్షులు సొల్లుటి మాధవరెడ్డి,దామెర మండల అధ్యక్షులు మన్యం ప్రకాష్ రెడ్డి,నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవెందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని టి పిసిసి అధ్యక్షుడిని కలువడం జరిగింది‌.

ఈ సందర్భంగా వారు కొండ మురళి ఇటివల చేసిన అనుచిత వ్యాఖ్యలతో పాటు కొండా సురేఖకు గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించి పరకాలకు పంపిస్తే వారి కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయడం జరిగిందన్నారు. కానీ కొండా దంపతులు మాత్రం అనంతరం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను పట్టించుకోకుండా, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో పార్టీ బలహీనపడడానికి కారణమయ్యారంటూ ఆరోపించారు. గతంలో కొండ దంపతులు పరకాలకు మేము వెళ్ళాము అని బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయంటూ గుర్తు చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో అధిష్టానం ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి బి ఫామ్ కేటాయించి పంపిస్తే పరకాల నియోజకవర్గానికి చెందిన ప్రతి కార్యకర్త ఆయనకు వెన్నుదన్నుల నిలబడి గెలిపించుకోవడం జరిగిందన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త పాత తేడా లేకుండా కార్యకర్తలు అందరిని సమదృష్టితో ముందుకు నడిపిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో కొండా మురళి పార్టీ ఐక్యతను విచ్చిన్నం చేయడం కోసం, కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తూ పరకాల నియోజకవర్గం లో సుష్మిత పటేల్ తిరుగుతారంటూ తన ఇష్టానికి ప్రకటనలు చేయడం పార్టీ అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. అనతి కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొండా మురళి చేస్తున్న దుష్ప్రచారాన్ని , పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాల్సిన అవసరం ఉందంటూ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వినతిపత్రం ద్వారా విన్నవించారు. పార్టీ క్షేమం కోసం కొండా దంపతులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ 15,16,17 డివిజన్ల అద్యక్షులు కొండేటి కొమురారెడ్డి,మలహల్రావ్ తిరుపతి రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad