పలు ఫైళ్లపై మంత్రి అడ్లూరి తొలి సంతకం
సచివాలయంలో బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరిం చారు. ఆయనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమా నికి సంబంధించిన ఫైళ్లపై అడ్లూరి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల స్వయం ఉపాధి యూ నిట్లకు రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. వికలాంగుల స్వయం సహాయక సంఘాలకు రూ.3.55కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఎస్సీ లబ్దిదారుల సంఖ్యను 210 నుంచి 500కి పెంచా మన్నారు. గిరిజన విద్యా సంస్థల మరమ్మతులకు రూ.79.61కోట్లు, గిరిజన మినీ గురు కులాల నిర్వహణకు రూ.17.18 కోట్లు, మేడారం జాతర మిగిలిన పనులకు రూ.44.5కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జేఈఈ, నీట్‌లో ప్రతిభ కనబరిచిన 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి
అనంతరం గౌలిదొడ్డి సంక్షేమ కళాశాల, పాఠశాలకు వెళ్లిన మంత్రి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణిలతో కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకిచ్చిన స్మార్ట్ కార్డుల ద్వారా ఫోన్ కాల్స్ విధానాన్ని పరిశీలించి స్వయంగా ఒక విద్యార్థిని చేత వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేయించారు. మంత్రి కూడా ఆ అమ్మాయి తల్లి దండ్రులతో మాట్లా డారు. పాప చదువు, హాస్టల్ వసతి పట్ల తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసు కున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విద్య, వసతి, పోషణ తదితర అంశాలలో మరింత మెరుగుదల కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని రేయింబవళ్లు కష్టపడితే సునాయాసంగా టార్గెట్‌ను చేరుకోవచ్చని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా నడుచుకుంటూ వారి పేరు నిలబెట్టాలని సూచించారు. తానూ వారిలాగే అదే సామాజిక తరగతి నుంచి వచ్చానని గుర్తు చేశారు. ఐఐటీ, జేఈఈతో పాటు మెడిసిన్ సీట్లు సంపాదించిన విద్యార్థులకు ఈ సందర్భంగా లాప్‌టాప్‌లను బహూకరించారు.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES