Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపైసల దందా వల్లే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు

పైసల దందా వల్లే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు

- Advertisement -

– ఆయన్ను దేశం దాటించే ప్రయత్నం
– సిగ్గు లేకుండా అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌

పైసల దందా వల్లే హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ చెప్పారు. ప్రజా సమస్యలపై ఆయన ఏమైనా ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. ఆయన అరెస్టును సిగ్గు లేకుండా మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఖండిస్తున్నారని విమర్శించారు. ఒక దొంగకు వారు మద్దతు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు డాక్టర్‌ లింగం గౌడ్‌, చరణ్‌కౌశిక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పైసల కోసం క్రషర్‌ యజమానులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన కారణంగా ఆయన్ను అరెస్ట్‌ చేశారని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎట్లా అయితే దొంగలను బయట దేశాలకు పంపినట్టు…కౌశిక్‌రెడ్డిని కూడా దేశం దాటించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు చూశారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కౌశిక్‌రెడ్డి పైసలు తీసుకున్నారని ఆరోపించారు. తాము చేసిన దొంగతనాలు ఎక్కడ బయట పడతాయనే ఆందోళనతో కేటీఆర్‌, హరీశ్‌రావు బనకచర్ల విషయంలో ముందుగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ విషయంలో ఆనాటి సీఎం జగన్మోహన్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే బనకచర్ల విషయంలో ప్రమాణం చేయాలని సవాల్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad