Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకేంద్రానికి మెట్రో ఫేజ్ II-బి ప్రతిపాదనలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

కేంద్రానికి మెట్రో ఫేజ్ II-బి ప్రతిపాదనలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఫేజ్ II-బి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలతో (డీపీఆర్‌లు) కూడిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది.

ఫేజ్ II-బి కింద మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి గాను రూ.19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 7,168 కోట్లతో, జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 6,946 కోట్లతో, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 5,465 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad