Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అసత్య ఆరోపణలు సరికాదు 

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అసత్య ఆరోపణలు సరికాదు 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మర్రి నరేష్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
: ఇందిరమ్మ ఇండ్ల పంపిణి పై అసత్య ఆరోపణలు చేయడం సరైనది కాదని, తప్పుడు ఆరోపణ చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మర్రి నరేష్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా మరి నరేష్ మాట్లాడుతూ అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ల కళను దశలవారీగా నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం అని, అది నిరంతర ప్రక్రియ అని, వాటిపై తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ములుగు జిల్లాకు 3500 ఇందిరమ్మ ఇల్లు తో పాటు అదనంగా 1500 ఇండ్లు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క దే అన్నారు. ములుగు నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు.

కాటాపూర్ లో బిఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడారని ఎద్దేవ చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ క్వారీలు నడుస్తున్నాయని, ఇసుక రవాణా చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పరితపించే మంత్రి సీతక్క పై, ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రజా ప్రభుత్వం పై ఓరవలేక తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad