- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీ రమేశ్ పాకాకు బెస్ట్ హ్యూమనటేరియన్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు లభించింది. విజన్ స్టూడియోస్ మానవత్వాన్ని పట్టం కట్టే క్రమంలో ప్రధానం చేస్తున్న అవార్డు కోసం రమేశ్ పాకాను ఎంపిక చేసింది. ప్రభుత్వ ఉద్యోగం లభించాక రోజుకు ఒక్కరికైనా సహాయం చేయాలని భావించిన రమేశ్ పాకా సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తూ, మానవీయ విలువలకు ప్రాధాన్యమిస్తున్న రమేశ్ పాకా పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.
- Advertisement -