Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఈరోజు సాయంత్రం 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్

ఈరోజు సాయంత్రం 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇవాళ సాయంత్రం 3 గంటలకు సెక్రెటేరియట్‌లో క్యాబినెట్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. కొత్త మంత్రుల బాధ్యతలు స్వీకరించిన తర్వాత జ‌రుగుతున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది.

ఈ భేటీలో పరిపాలన పరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధాన చర్చ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.వాన కాలం పంటలకు రైతు భరోసా నిధుల పంపిణి రికార్డు, ముగిసిన రెవిన్యూ సదస్సులు 9 లక్షల అర్జీలు. తదుపరి కార్యాచరణ, స్పోర్ట్స్ పాలసీ పై చర్చించ‌నున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రి వర్గ ఆమోదం ఉందా లేదా.. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని ప్రభత్వనికి లేఖ రాసిన పీసీ ఘోష్ కమిషన్. ఈరోజు మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.

ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన‌ ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై చర్చించ‌నున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad