నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కల్తీ సందీప్ అనే యువకుడు ఇటీవల పురుగుమందు తాగి ములుగు సివిల్ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నాడు. సోమవారం విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయం మాజీ చైర్మన్ పోరిక గోవింద నాయక్ హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించారు. వైద్యులను పేషంట్ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసి యువకునికి మంచి వైద్యం అందించాలని, హాస్పిటల్స్ సూపర్డెంట్ మోహన్ లాల్ తో మాట్లాడి మెరుగైన వైద్యం చేయాలని కోరారు.అలాగే జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి హెర్నియాతో బాధపడుతూ ములుగు సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించి మెరుగైన వైద్యం చేయాలని సూపర్డెంట్ గారిని కోరారు.
చికిత్స పొందుతున్న వ్యక్తికి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES