నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రైతు భరోసా రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వాలని కోరుతూ సోమవారం గౌస్ నగర్ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం గుర్తించిన సాగు చేస్తున్న ఆమోదయోగ్యమైన భూమికి రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతు భరోసా పథకం రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం వరకే డబ్బులు వచ్చాయని మిగతా ఎకరానికి రాలేదని, మరి కొంతమందికి మొత్తమే రాలేదని , అందరికీ అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు చీర్కా సుగుణమ్మ, బలుగూరి అనసూయ, మోహన్ రెడ్డి కిష్టయ్య, కొండల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రామ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, శంకరయ్య, లక్ష్మారెడ్డి, సంతోష, నరసింహ, మహేష్ తో పాటు పాలువురు రైతులు పాల్గొన్నారు.
రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ కు వినతి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES