Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రజా సేవకుడి జన్మదిన వేడుక

ఘనంగా ప్రజా సేవకుడి జన్మదిన వేడుక

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
పేద ప్రజల పెన్నిధి.. అభాగ్యుల ఆపద్భాందవుడు.. వికలాంగుల జీవితాల్లో వెలుగు… దేవాలయ నిర్మాణ దార్శనికుడు.. పాఠశాలల అభివృద్దికి అక్షర సాధకుడు.. సబ్బండ వర్గాల క్షేమం కోరే ప్రజా సేవకులు ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుక సోమవారం మండలంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాణ సంచాలు కాల్చి, కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. మండలంలో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని కార్యకర్తలు అంటున్నారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆర్థిక సహాయాలు అందజేస్తున్నారని తెలిపారు.

యువత సన్మార్గంలో నడవడానికి క్రమశిక్షణ కోసం క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనాధలకు, అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నారని శ్రీనివాస్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, పార్టీ మండల కార్యదర్శి పూస మధు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి,మధుకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గారె నర్సయ్య, ఐత రాంచందర్, గజ్జవెళ్లి ప్రసాద్, కందికట్ల స్వామి, బొడ్డు రంగయ్య, ఎండి అక్బర్, తల్లపెళ్లి సంతోష్ గౌడ్, భద్రు నాయక్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి,చందు రాము, చందు సతీష్,ఐత రవి, ఐత జంపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -