Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమంలో రాజీపడని ప్రభుత్వం: ఎమ్మెల్యే కుంభం

రైతు సంక్షేమంలో రాజీపడని ప్రభుత్వం: ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి  కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డిది, కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.  రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు.తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథలయం చైర్మన్‌ అవైస్‌ చిస్తీ. పొత్నాక్‌ ప్రమోద్‌ కుమార్, టీపీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, నాయకులు  పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేష్, బర్రె జహంగీర్, కృష్ణ రెడ్డి, నర్సింహా, సలాద్దీన్, ఈరపాక నర్సింహా, బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad