– జూలై 5 వరకు కవితలను పంపండి: తెరవే
నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రచయితల వేదిక ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర రజతోత్సవ మహాసభలు అక్టోబర్ లో జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులతో ప్రత్యేక కవితా సంకలన గ్రంథం తీసుక వస్తున్నట్లు తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. దీనికోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కవులు, రచయితలు తమ కవితలను 9849062038 నెంబర్ కు వాట్సాప్ ద్వారా తనకు   కవితలను పంపించాలని, నేను చూస్తున్న తెలంగాణ అనే అంశంపై 2014 తరువాత తెలంగాణ సామాజిక, రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాలపై అభిప్రాయం కవిత రూపంలో ఉండాలని కవిత 25 లైన్లకు మించకుండా పది సంవత్సరాల తెలంగాణపై ప్రత్యేక శైలితో రాసిన కవిత చక్కగా ఉండాలని డిటిపి చేసిన కవిత చివర కవి పేరు, సెల్ నెంబర్, జిల్లా రాయాలని ఒకరు ఒక కవిత మాత్రమే పంపాలని, కవితలు పంపించడానికి జూలై 5 చివరి తేదీగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
కవితా సంకలనం కోసం కవితలకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    