Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeసినిమా'రిజానా'తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ

‘రిజానా’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ

- Advertisement -


నిజమైన కథ ఆధారంగా రూపొందిన ‘రిజానా – ఎ కేజ్డ్‌ బర్డ్‌’ చిత్రంతో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఇందులో ప్రముఖ బ్రిటిష్‌ నటుడు జెరెమీ ఐరన్స్‌ సరసన ఆమె నటిస్తున్నారు. సీనియర్‌ దర్శకుడు చంద్రన్‌ రత్నం ఈ సినిమాని శ్రీలంకలో చిత్రీకరించారు.
ఈ ప్రాజెక్ట్‌ గురించి వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ,’ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్‌ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. ‘లయన్‌ కింగ్‌’ సినిమాలో స్కార్‌ పాత్రకు ఆయనే వాయిస్‌ ఇచ్చారు. ఆ సినిమా నాకు ఇష్టం. అన్ని డైలాగులు నాకు పక్కాగా గుర్తుండి పోయేంతగా చూసాను. ఇప్పుడా సినిమాకు వాయిస్‌ ఇచ్చిన ఆయనతో నేను నటించడం అనేది ఒక గొప్ప అవకాశం. చంద్రన్‌ రత్నం దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం. శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్త దారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని ఒక మైలురాయి’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad