Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఅంతర్జాతీయంఐఏఈఏతో కలిసి పనిచేయం

ఐఏఈఏతో కలిసి పనిచేయం

- Advertisement -

ఇరాన్‌ పార్లమెంట్‌ కీలక నిర్ణయం
సుప్రీం నేషనల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేయాలి
ఐఏఈఏతో కలిసి పనిచేయం
టెహరాన్‌:
ఇజ్రాయిల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకొంది. ఇక మీదట అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించింది. ఇరాన్‌ పార్లమెంట్‌ ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేసింది. దీనికి ఆ దేశ సుప్రీం నేషనల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ”ఇరాన్‌ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఖండించడానికి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నిరాకరించింది. దీంతో విశ్వసనీయతను వేలానికి పెట్టినట్లైంది” అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ ఘలిబాఫ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ అణు కేంద్రాల భద్రతకు గ్యారెంటీ ఇచ్చే దాకా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని పార్లమెంట్‌ తీర్మానించింది. తాజాగా ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య కాల్పుల విరమణ పట్ల అంతర్జాతీయ అణు శక్తి సంస్థ స్వాగతించింది. ఈ యుద్ధం జరిగినన్ని రోజులు ఐఏఈఏ ఇన్‌స్పెక్టర్లు ఇరాన్‌లోనే ఉన్నారు. ఈ నెల 22వ తేదీ తెల్లవారు జామున అమెరికా బాంబర్‌ విమానాలు ఇరాన్‌లోని నతాంజ్‌, ఫోర్డో తదితర అణు కేంద్రాలపై భారీ ఎత్తున దాడి చేసినవిషయం విదితమే. దానికి ప్రతిగా తామూ క్షిపణి దాడులతో అమెరికా మెడను వంచినట్టు ఇరాక్‌ ప్రకటించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad