Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైవే దాబాలపై పోలీసుల దాడులు 

హైవే దాబాలపై పోలీసుల దాడులు 

- Advertisement -

– నేషనల్ హైవే -161 పై అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న డాబాలపై ఏకకాలంలో  దాడి
– నాలుగు స్పెషల్ టీంతో రైడ్ 
– డాబాల యజమానులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు
నవతెలంగాణ –  కామారెడ్డి
: మద్యం మత్తులో వాహనాలు నడిపి  రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేషనల్ హైవేపై ఉన్నటువంటి డాబాల యందు మద్యం అమ్మకాలు  చేయడం నేరం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం రాత్రి నేషనల్ హైవే 161 పై అనుమతులు లేకుండా మధ్య నమ్ముతున్న దాబాలపై స్పెషల్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హైవే పక్కన గల దాబాలలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

ఇలాంటి రోడ్డు ప్రమాదలను నివారించాలని ఉద్దేశంతో బుధవారం రాత్రి ఏకకాలంలో అన్ని డాబాలపై రైడ్  చేయడం జరిగిందన్నారు . నాలుగు స్పెషల్ టీంతో రైడ్ చేయగా మొత్తం 6 దాబాల్లో తనిఖీ చేయగా 132 బాటిల్స్ మద్యం   71 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఇకపై ఎవరు కూడా డాబాల యందు మద్యం అమ్మకాలు గాని మద్యం సేవించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేస్తే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -