Tuesday, April 29, 2025
Homeజాతీయంఘనంగా ప్రారంభమైన ఏయూ దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా ప్రారంభమైన ఏయూ దశాబ్ది ఉత్సవాలు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) శతాబ్ది ఉత్సవాలు శనివారం విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం వందేళ్ల మైలురాయిని పురస్కరించుకుని, బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య మధుమూర్తి మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లుగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుa, వివిధ రంగాల నిపుణులను దేశానికి అందించిందని కొనియాడారు. తన కుటుంబంలోని మూడు తరాల వారు ఇక్కడే విద్యనభ్యసించారని, అలాంటి విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా పాఠ్యప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికతను విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతోందని వివరించారు. ఏయూ ఘన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img