Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఆటలుకష్టాల్లో బంగ్లాదేశ్‌

కష్టాల్లో బంగ్లాదేశ్‌

- Advertisement -

శ్రీలంకతో రెండో టెస్టు

కొలంబో : శ్రీలంకతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాల్లో కూరుకుంది. 211 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టిన బంగ్లాదేశ్‌ మూడో రోజు ఆట ముగిసేసరికి 115/6తో నిలిచింది. ఇస్లామ్‌ (12), అనాముల్‌ (19), మోమినుల్‌ (15), నజ్ముల్‌ (19), ముష్ఫీకర్‌ (26), మెహిది హసన్‌ (11) నిష్క్రమించగా.. లిటన్‌ దాస్‌ (13 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 247 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరో 96 పరుగుల వెనుకంజలో నిలిచిన బంగ్లాదేశ్‌.. నేడు ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించుకునేందుకు లోయర్‌ ఆర్డర్‌పై ఆధారపడనుంది. శ్రీలంక బౌలర్లు ప్రభాత్‌ (2/47), ధనంజయ (2/13) రాణించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad