Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూమి పట్టా పాస్ బుక్, నగదు మిస్సింగ్

భూమి పట్టా పాస్ బుక్, నగదు మిస్సింగ్

- Advertisement -

దొరికిన వారు అందజేయాలని గుండెబోయిన పొట్టయ్య వినతి 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన గుండెబోయిన పొట్టయ్య, తండ్రి  పాపయ్య (Late) పస్రా కెనరా బ్యాంక్ కు పోయి, వస్తున్న క్రమంలో  ఆయనకు సంబంధించిన, భూమి పట్టా పాస్ పుస్తకాలు (3 ఎకరాల పైన), ఆధార్ కార్డు, కెనరా బ్యాంక్ పస్రా పాస్ బుక్, రూ.7000 రూపాయల నగదు, ఉన్న బ్యాగ్ పోయింది. దొరికిన వారు తిరిగి అందజేయాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక చికెన్ షాప్, కిరాణం షాప్, లేదా దారి వెంట ఎక్కడ పడిపోయిందో ఆయనకు అవగాహన రావడం లేదు. దయచేసి దొరికిన వారు తిరిగి తెచ్చివ్వాలని విన్నవించుకుంటున్నారు. లేదంటే ఈ విషయం పై తాడ్వాయి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వనున్నట్లు బాధితుడు తెలిపారు. ఈ బ్యాగు దొరికిన వారు 94936 51892, 70750 54106, గల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలియచేయాలని విన్నవించారు. దొరికిన వారు డబ్బులు తీసుకున్న పర్వాలేదు, కానీ భూమి పట్టా కాగితాలు, ఆధార్, బ్యాంక్ పాస్ పేపర్లు తెచ్చి ఇవ్వగలరని కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad