Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

– మూతపడిన బడులను సందర్శించిన ఎంఈఓ, డిసిఇబి సెక్రెటరీ
నవతెలంగాణ – రాయపర్తి : విశ్లేషణాత్మక కథనాలతో అక్షర సత్యాలను రాసే నవతెలంగాణ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. మండలంలో 14 ప్రైమరీ పాఠశాలలు గతంలో మూతపడ్డాయి.. ఈ విద్యా సంవత్సరంలో మూతపడిన పాఠశాలల పునః ప్రారంభానికి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టలేదు, 16 మంది ఉపాధ్యాయులు డిప్టేషన్ లో పనిచేయడంతో ఉపాధ్యాయుల జాడ ఎక్కడ? అనే అంశంపై గత శనివారం నవతెలంగాణ దినపత్రికలో “మూగబోయిన బడి గంటలు..!” కథనం ప్రచురించబడింది. దాంతో మూతబడిన బడుల ఉపాధ్యాయులు ప్రస్తుతం డిప్టేషన్ పై ఇతర పాఠశాలలో పనిచేస్తున్నారు వారితో ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్, జిల్లా డిసిఇబి సెక్రటరీ, రాయపర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు గారె కృష్ణమూర్తి సమావేశం ఏర్పాటు చేసి సోమవారం నుంచి పాఠశాలల పునః ప్రారంభానికి బడి బాట కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.

తదుపరి వారు మూతపడిన రావుల తండా పాఠశాలను సందర్శించారు. తండాలో 20 మంది ప్రైమరీ విద్యార్థులు ఉండగా పాఠశాల మూతపడి ఉండడంతో ప్రైవేట్ స్కూలుకు వెళ్తున్నట్లు తెలిసింది. పాఠశాల భవనం శిధిలావస్థలో ఉండగా ప్రస్తుతం అంగన్వాడి సెంటర్లో పాఠశాల నిర్వహించాలని వారు సదరు ఉపాధ్యాయునికి తెలిపారు. ఏడు పాఠశాలలు గత విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు లేనందున మూతపడ్డాయి దీంతో ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం డిప్టేషన్ లో కొనసాగుతున్నారు. ఈ విద్య సంవత్సరం డిప్టేషన్ రద్దు కానందున యధావిధిగా డిప్టేషనులు కొనసాగుతున్నాయి అని వివరించారు. ఎర్ర కుంట తండా పాఠశాలను బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 12 నుంచి పునః ప్రారంభించినట్లు తెలిపారు. మూతపడిన ప్రతి పాఠశాలను సందర్శించి పునః ప్రారంభానికి ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad