Friday, October 31, 2025
E-PAPER
Homeక్రైమ్రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య

రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శనివారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 08.50 గంటల సమయంలో నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ అయినా  చందన్ కుమార్ ఇచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కె ఎమ్ నంబర్ 461/07-08 వద్ద ఎల్లమ్మ గుట్టకు చెందిన జాదవ్ శివ తేజ 19 గుర్తు తెలియని కారణలచే జీవితం పై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూం కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆత్మహత్యగల కారణాలు ఇంకా తెలియ రాలేదన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -