Tuesday, July 1, 2025
E-PAPER
HomeNewsకుటుంబ భావోద్వేగాలతో 'తమ్ముడు'

కుటుంబ భావోద్వేగాలతో ‘తమ్ముడు’

- Advertisement -

‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో వస్తున్న మరో మూవీ ‘తమ్ముడు’. నితిన్‌ హీరోగా దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 4న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డిఫరెంట్‌ లేయర్స్‌ ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. సెన్సార్‌ వాళ్లు కొన్ని కట్స్‌ చెప్పారు. మేము ఆ కట్స్‌ వద్దు అనుకున్నాం. ఒప్పుకుంటే ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్‌ను కరెక్ట్‌గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కట్స్‌ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్‌ తీసుకున్నాం. సినిమాలో అంతగా హింస లేదు.
ఈ కథలో హీరోతో పాటు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరో అంటే ఇంత లెంగ్త్‌ ఉండాలి అనేది ఈ సినిమాలో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు మహిళా క్యారెక్టర్స్‌ బలంగా ఉంటాయి. ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్క్‌ ఉంటుంది. నా స్క్రిప్ట్స్‌లో ఫీమేల్‌ క్యారెక్టర్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇప్పటిదాకా అలా చేస్తూ వచ్చాను.మా పాప దిత్య ఈ చిత్రంలో ఒక కీ రోల్‌ చేసింది. ‘విక్రమ్‌’లో కమల్‌ హాసన్‌ క్యారెక్టర్‌ కథలో ఎలా ట్రావెల్‌ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది. కథ ప్రకారమే ‘తమ్ముడు’ టైటిల్‌ పెట్టాం.
ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్‌ స్ఫూరితో ఈ కథను సిద్ధం చేసుకున్నా. ఈ కథ విని దిల్‌ రాజు బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో ‘ఐకాన్‌’ మూవీ కోసం వర్క్స్‌ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్‌ చేశాం. ఈ కథకు సెట్‌ అయ్యే హీరో కోసం సెర్చ్‌ జరిగింది. నితిన్‌ బాగుంటాడని తీసుకున్నాం.
లయ పాత్ర కోసం ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన ఒకరికి కథ చెప్పాను. ఆమెకు స్టోరీ, క్యారెక్టర్‌ నచ్చింది. కానీ తన పర్సనల్‌ రీజన్స్‌ వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్‌ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. ఆ తర్వాత లయ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమెది ఈ మూవీలో 90 డేస్‌ క్యారెక్టర్‌. తను బాగా సపోర్ట్‌ చేశారు.
మన సినిమాల్లో ఫైట్స్‌ త్వరగా వచ్చి వెళ్తుంటాయి. మా సినిమాలో ఫైట్స్‌ను ఎపిసోడ్స్‌గా ఫీల్‌ ఉండేలా రూపొందించాం. ఈ ఫైట్‌ సీక్వెన్సులు మంచి ఇంపాక్ట్‌ చూపిస్తాయి. ఒక గర్వం నిలబడటానికి జరిగిన యుద్ధమే తమ్ముడు మూవీ. బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా కథలో ఉన్నా అనేక లేయర్స్‌తో మూవీ సాగుతుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ లోకనాథ్‌ మా మూవీకి మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. థియేటర్‌లో ఆయన వర్క్‌ చూస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -