- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల సామాన్యులపై భారం మోపుతోంది. తాజాగా రాష్ట్రంలో బియ్యం ధరలు కూడా పెరగడంతో వారిపై అదనపు భారం పడుతోంది. HMT, BPT, తెలంగాణ సోనాతో పాటు జైశ్రీరామ్ బ్రాండ్ రైస్ క్వింటాల్‌పై రూ.1000-1200 వరకు పెరిగాయి. గతంలో వివిధ రకాల బియ్యం ధరలు కేజీ రూ.40-50 వరకు విక్రయించగా ప్రస్తుతం రూ.60-70కి చేరింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు తగ్గుతోందనే నెపంతో వ్యాపారులు ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రైస్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.
- Advertisement -



