Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంనేటి నుంచి రైల్వే చార్జీల బాదుడు

నేటి నుంచి రైల్వే చార్జీల బాదుడు

- Advertisement -

అన్ని జోన్‌ల మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ
500 కి.మీ మించితే అదనపు భారం
న్యూఢిల్లీ:
కొత్త రైల్వే చార్జీలు, టికెట్‌బుకింగ్‌లో నిబంధనల అమలుపై రైల్వేబోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి కొత్త రైల్వే చార్జీలు, టికెట్‌ బుకింగ్‌లు అమలులోకి వస్తాయని తెలిపింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు రైల్వేశాఖ ఆధార్‌ను రైల్వేశాఖ తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి(మంగళ వారం) అమలులోకి తీసుకురావాలంటూ అన్ని జోన్‌ల మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేసింది.


ప్రయాణికులపై భారం ఇలా..
సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీకి 500కి.మీ వరకు సాధారణ చార్జీలే ఉండనున్నాయి. 501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5 , 201 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10, 2501 నుంచి 3వేల కి.మీ వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్‌ క్లాస్‌, ఫస్ట్‌ క్లాస్‌ ఆర్డినరీ టికెట్లపై కి.మీకు అరపైసా చొప్పున పెంచగా.. మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ (నాన్‌ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్‌ ఏసీ ఫస్ట్‌, సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంచారు. అలాగే, అన్ని రకాల రైళ్లలో ఏసీ అన్ని తరగతులకు కి.మీకు 2పైసలు చొప్పున పెంచుతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. రిజర్వేషన్‌ చార్జి, సూపర్‌ఫాస్ట్‌ సర్‌చార్జీల్లో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -