– యూఐటీపీ-2025 అవార్డు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఆసియా పసిఫిక్ ప్రాంతానికి(హైదరాబాద్) ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు లిమిటెడ్‌కు జర్మనీలోని హాంబర్గ్‌లో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక యూఐటీపీ-2025 అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు పురస్కారం దక్కింది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఆర్టీఏ) తోడ్పాటుతో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ‘ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ పర్ ట్రెయిన్’ ప్రాజెక్టుకుగాను ఈ పురస్కారం లభించింది.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్(యూఐటీపీ) నిర్వహించే ఈ పురస్కారాల కార్యక్రమం అర్బన్ మొబిలిటీని తీర్చిదిద్దుతున్న పరివర్తనాత్మకమైన ప్రాజెక్టులకు విశిష్ట గుర్తింపునిస్తోంది. గ్లోబల్ నెట్‌వర్క్ యూఐటీపీలో దాదాపు 100కుపైగా దేశాల నుంచి వివిధ ప్రజారవాణా మాధ్యమాలకు చెందిన 1,900 ఆర్గనైజేషన్లు సభ్యత్వం పొందాయి. 2025 ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ట్రాన్సిట్ ఆపరేటర్ల నుంచి 500పైగా ఎంట్రీలు వచ్చాయి. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో హైదరాబాద్ మెట్రో సమర్పించిన ఎంట్రీకి టాప్ 5 ఫైనలిస్టుల షార్ట్‌లిస్టులో చోటుదక్కింది. డేటా, సమర్థత ఆధారిత విధానాలకుగాను ప్రత్యేక గుర్తింపు లభించింది. యూఐటీపీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందడం ఎంతో గర్వకారణమని ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సీఎండీ కేవీబీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమర్థత, ప్రయాణికులకు ఉపయుక్తమైన సొల్యూషన్స్‌పై తమకున్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య మెట్రో ప్రాజెక్టు ఆపరేటర్‌గా, నిర్వహణ సామర్థ్యాలు, పురోగామి వ్యూహాలతో హైదరాబాద్ మెట్రోను ప్రపంచ వేదికపై నిలబెట్టడంపై గర్విస్తున్నామని తెలిపారు.
ఎల్ అండ్ టీ మెట్రోకు అంతర్జాతీయ పురస్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES