Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ నిర్వాసితుల ఇండ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

భూ నిర్వాసితుల ఇండ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టులో ముంపుకి గురైనా బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేన బాద్ కాలనీలో కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావుతో కలిసి మంగళవారం రోజు పరిశీలించారు. కాలనీకి  కావాల్సిన అన్ని సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామస్తుల కోరిన విధంగా కొత్త రోడ్డు సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. 

భూ నిర్వాసితులు గ్రామాన్ని, ఇంటిని నిర్మించుకునేందుకు గ్రామస్థులతో మాట్లాడి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. కాలనీలో త్వరగా మంచి నీటి, రోడ్డు, డ్రైనేజీ వంటి సదుపాయలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో  రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -