జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా చీప్ ప్లానింగ్ ఆఫీసర్ గా సామెల్ ఉత్తమ ఉద్యోగ అధికారిగా జిల్లాలో సేవలు అందించారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజున సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి సామ్యూల్ పదవి విరమణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చీఫ్ ప్లానింగ్ అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతరం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కలెక్టర్ ఫండ్ నుండి ఏ ఒక్క ఫైల్ పెండింగ్ లేకుండా వేగవంతంగా విధులు నిర్వహించారన్నారు. జిల్లాకు సంబంధించిన ఎం.పి ల్యాడ్స్ తదితర ప్రభుత్వ స్కీములకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేశారన్నారు. స్వాతంత్ర , గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అన్ని శాఖల ప్రగతి నివేదికను తీసుకొని ముఖ్య అతిధి ప్రసంగించేందుకు రాత్రి ,పగలు ఎంతో కృషి చేశారన్నారు.
ఇలా విధులలో ఆటకంకం లేకుండా చీఫ్ ప్లానింగ్ అధికారి సామ్యూల్ సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారు , వారి కుటుంబ సభ్యులు సుఖ శాంతులతో జీవితంలో ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భాస్కరరావు, ఏవో జగన్మోహన్ ప్రసాద్, జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.