Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రైమరీ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని పంకు రిషికకు షూస్, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో అధికంగా అడ్మిషన్లు నమోదు అయ్యేటట్లు చూడాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వర్షాల ప్రభావంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పాఠశాలలో విద్యార్థులకు వేడి ఆహారాన్ని అందించాలి అన్నారు. 

కేజీబీపీ పాఠశాలల సందర్శించిన ఎంఈఓ

రాయపర్తి మండల ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్ తిర్మలాయపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాని సందర్శించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థినిలకు సరైన వసతి కల్పించాలన్నారు. తరగతుల నిర్వహణ, అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి తగు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయుడు గారె కృష్ణమూర్తి, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సతీష్, ఉర్దూ పాఠశాల హెచ్ఎం సాషిస్తా బేగం, మధ్యాహ్న భోజనం ఇంచార్జ్ సురేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -