నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం(డాక్టర్స్ డే) ఘనంగా నిర్వహించారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యులు డాక్టర్ వేముల రంజిత్, పల్లెదవఖాన వైద్యులు స్నిగ్ధలు చేసిన సేవలను గుర్తించి, వారిని పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ప్రాణం పోసే వైద్యుడు దైవంతో సమానమని అందుకే “వైద్యో నారాయణో హరి” అన్నారని పలువురు వక్తలు కొనియాడారు. వైద్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వేముల రంజిత్, పల్లె దవఖాన వైద్యులు డాక్టర్ స్నిగ్ధ, హెచ్ ఈ ఓ బల్గూరి సమ్మయ్య, పీహెచ్ఎన్ రాంబాయి, ఫార్మసిస్ట్ శివరంజని, ల్యాబ్ టెక్నీషియన్ కుర్సం శ్రీధర్, ఏఎన్ఎంలు చంద్రకళ, గంగా, రాజేశ్వరి, పుష్ప, ఎల్లారమ్మ, నవలోక, హెల్త్ అసిస్టెంట్ లు అనిల్, ముత్తయ్య, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాటాపూర్ పీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES