నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బంగారు పల్లి గ్రామంలో జుక్కల్ మెడికల్ ఆఫీసర్ విట్టల్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు డాక్టర్ విక్రమ్ మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపులో పలు సమస్యలతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధించిన మందులను ఉచితంగా అందించారు.
పలువురికి వైద్యం చేసేముందు బీపీ , షుగర్ ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తమ పరిధిలో లేని రోగాల సమస్యలను జిల్లా ప్రభుత్వ పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితోపాటు వైద్యుడు విక్రమ్, అంగన్వాడి టీచర్ జయబాయి, పిఎస్ , సూపర్వైజర్ , ఏఎన్ఎంలు , దోస్తుపల్లి ఆశ వర్కర్ బశవ్వ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు .
బంగారుపల్లిలో హెల్త్ క్యాంప్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES