Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సన్మానం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : ఇందిరమ్మ పథకంలో భాగంగా స్లాబ్ లెవెల్ వరకు గృహనిర్మాణాలు చేపట్టిన బంగారు పల్లి గ్రామ లబ్ధిదారులైన పలువురికీ  జుక్కల్ ఎంపీడీవో శ్రీనివస్ గృహ నిర్మాణదారులకు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ బంగారు పల్లి గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులు ఇప్పటికే స్లాబ్ లెవెల్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టారని అన్నారు.  ప్రభుత్వం గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు డబ్బులను వారి ఖాతాలలో వివిధ దశలలో వెనువెంటనే జమ చేయడం జరిగిందని తెలిపారు.

మొదట్లో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు మందకోడిగా పనులు కొనసాగినాయని, నిత్యం గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులకు నాతో పాటు ఇతర అధికారులు అవగాహన పరచడంతో అందించుకోవడానికి ముందుకు వచ్చారని తెలిపారు. లబ్ధిదారులకు వారికి చేకూర్చే లబ్ధి తెలపడంతో ముందుకు వచ్చి ఇంటి నిర్మాణాలను వంతుల వారీగా తామే ముందుగా ఉండాలని లబ్ధిదారులు నిర్ణయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే మండల పరిషత్ కార్యాలయం తరఫున సంతోషించి వారికి శాలువలతో సత్కరించి సన్మాన కార్యక్రమం చేశామని తెలిపారు. అదేవిధంగా దోస్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మించుకుంటున్న గృహ నిర్మాణాలను పరిశీలించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు బంగారుపల్లి గ్రామ ములో గృహ నిర్మాణాలు చేపడుతున్న గబ్ధిదారులు, దోస్తుపల్లి గ్రామ పెద్దలు పాండురంగ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -