నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : మండలంలోని డాబా హోటల్ నిర్వాహకులను మంగళవారం నాడు తహసీల్దార్ దశరథ్ ముందు స్థానిక ఎస్.ఐ మహేందర్ వారిని బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ.. మండల కేంద్రం గుండా జాతీయ రహదారి161పై మద్యం సేవించి వాహనాలు నడుపుతు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా డాబా హోటల్లో మద్యం తాగించడం, అమ్మడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. డాబా హోటల్లో మద్యం సేవించి వాహనదారులు ప్రమాదలకు గురై కుటుంబాలు విచ్చిన అవుతుందని అన్నారు. ఒక వేళ డాబా హోటల్ యజమానులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డాబా హోటల్లో మద్యం నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES