బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు పుట్ట మధుకర్ గతంలో తాడిచెర్ల నుండి భూపాలపల్లి వరకు రోడ్డును 2023వ సంవత్సరంలో జీవోతో పాటు రోడ్డు ఎస్టిమేషన్ రూ.33 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఖమ్మంపల్లి నుంచీ రోడ్డు నిర్మాణ పనులు కొంత మేర జరిగాయన్నారు.
పారెస్ట్ క్లియరెన్స్ లేక,అటవీశాఖకు చెల్లించాల్సిన రూ.4.70 కోట్లు చెల్లించక,అంతలోనే ఎన్నికలు రావడంతో రోడ్డు పనులు నిలిచాయన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కూడా ఎందుకు ఆ రోడ్డును స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకరాలేదని ప్రశ్నించారు. స్థానిక ప్రజలు అదనంగా ప్రయాణించాలంటే సుమారు 23 కిలోమీటర్లు తిరిగివలసి వస్తుంది దీనికి కారకులు మీరు కాదా? నిలదీశారు. తాడిచర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు.
ఇప్పటికైనా న్యాయం చేయకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.డేంజర్ జోన్లో ఉన్న ప్రజలకు న్యాయం చేయని పక్షంలో తాము బొగ్గు తవ్వకాలు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.కాంగ్రెస్ నాయకులు పాల్గొనడానికి సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కంపెనీలో పైసలు వసూలు చేసి ఉద్యోగాలు ఎవరు పెట్టించారో చెప్పాలన్నారు. ఆధారాలు లేకుండా అసత్యపు వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES