నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణా సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణా సాహిత్య గ్రంధ సూచిలో అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ సాహితీవేత్త సి.నా.రె అవార్డు గ్రహీత,తెలంగాణా ఉత్తమ సాహితీవేత్త పురస్కార గ్రహీత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు వ్రాసిన గ్రంధాలకు స్థానం లభించింది.
వీరు వ్రాసిన శతక సాహిత్యంలో మణిపూస కాళికాంబాసప్తశతి, రాతిపూలవనం, స్వచ్ఛతైవజయతే, బాపూజి,నిజానికి, అడ్డం తిరిగిన ఆదర్శాలు వంటి గ్రంధాల వివరాలను పొందుపర్చారు.ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో అటెటం దత్తయ్య గారి సంపాదకత్వంలో ఈ గ్రంధ సూచి వెలువడింది.
ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో తెలంగాణా సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి నుండి ఈ గ్రంధాన్ని ప్రభాకరాచార్యులు అందుకున్నారు.ఈ సందర్భంగా బాలా చారి మాట్లాడుతూ ప్రభాకరాచార్యులు రచనలు సమాజాన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయని గ్రంధసూచిలో వీటి వివరాలు పొందుపర్చటం అభినందనీయమని అన్నారు.