Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి: మంద సంపత్

పరకాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి: మంద సంపత్

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
 పరకాల పట్టణంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న పరకాల స్థానిక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ పై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. పరకాల గురుకుల పాఠశాలలోని విద్యార్థిని అనుమానస్పదంగా ఉదయం ఆత్మహత్య చేసుకోవడం పాఠశాల సిబ్బంది యొక్క తీరుపై అనుమానాలకు దారి తీసిందని వెంటనే ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా ఈ ఘటనపై పూర్తిగా ఎంక్వయిరీ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో ఏదో రకమైన అంటే ఫుడ్ పాయిజన్ , ఉపాధ్యాయుల వేధింపులు, అగ్రవర్ణాల కులం పేరుతో దూషించడం, వారు అని అవమానపరిచే సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు ఎన్ని మారిన విద్యార్థినీ విద్యార్థులపై సంఘటనలపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం వలన అనునిత్యం సమస్యలు పునరావృతం అవుతున్నాయి అని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో కనీసం పర్యవేక్షణ కరువైంది గురుకులాల సెక్రెటరీ వెంటనే తొలగించాలి భవిష్యత్తులో గురుకుల పాఠశాలలు ప్రభుత్వ విద్యాసంస్థలలో జరుగుతున్న సమస్యలపై ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -