Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంజాయి మద్యపానంకు యువత దూరంగా ఉండాలి: రవి పటేల్ 

గంజాయి మద్యపానంకు యువత దూరంగా ఉండాలి: రవి పటేల్ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గంజాయి, మద్యపానం, ధూమపానానికి యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటం రవి పటేల్ అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. గతంలో మండలంలో పలు సంఘటనలు జరిగిన దృశ పిల్లలంతా జాగ్రత్తగా ఉండాలని విద్యపై మక్కువ పెంచుకోవాలని ప్రతిరోజు వ్యాయామం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు పెట్టాలని, మంచి విద్య పొందే విధంగా మధ్యాహ్న భోజనం పరిసరాల పరిశుభ్రత పాటించాలని రవి పటేల్ ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో తాడిచర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు మేనం సంతోష్, అనంతుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -