Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమా'తమ్ముడు' సూపర్‌ హిట్‌ ఖాయం : దిల్‌రాజు

‘తమ్ముడు’ సూపర్‌ హిట్‌ ఖాయం : దిల్‌రాజు

- Advertisement -

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో వస్తున్న మరో మూవీ ‘తమ్ముడు’. నితిన్‌ హీరోగా దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 4న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ ట్రైలర్‌ను ఘనంగా లాంచ్‌ చేశారు.
నటి లయ మాట్లాడుతూ, ‘ఈ మూవీ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు డిఫరెంట్‌గా ఉందని అనుకున్నా. ఇలాంటి క్యారెక్టర్‌ని నేను ఇప్పటిదాకా చేయలేదు. నా గత చిత్రాలు చూసి నన్ను ప్రేక్షకులు ఎంతగా అభిమానించారో, అదే ప్రేమను ఈ మూవీ మీద చూపిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘ఈనెల 4న సాధించబోయే ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు శ్రీరామ్‌ వేణుకే దక్కాలి. ఈ సినిమాకు మేము పడిన కష్టం తక్కువ. ఈ సినిమా సక్సెస్‌ నీది. మనం ఘన విజయాన్ని అందుకోబోతున్నాం. నితిన్‌ తన కెరీర్‌లో ‘జయం, గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల సక్సెస్‌కు ఎంత సంతోషపడ్డాడో ఈ సినిమా విజయం అంతకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ప్రొడ్యూసర్స్‌గా మేము నితిన్‌కు ఆ ప్రామిస్‌ ఇస్తున్నాం’ అని నిర్మాత శిరీష్‌ చెప్పారు.
నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘ఈ మూవీ అవుట్‌ పుట్‌ ఇంత బాగా రావడానికి టెక్నీషియన్స్‌ కష్టమే కారణం. డీవోపీ గుహన్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌, ఆర్ట్‌ చేసిన శేఖర్‌..ఇలా టెక్నీషియన్స్‌ శ్రీరామ్‌ వేణు విజన్‌ను స్క్రీన్‌ మీదకు అద్భుతంగా తీసుకొచ్చారు. ‘జై బగళాముఖీ’ పాటతో మా సినిమాకు ఒక వైబ్‌ వచ్చింది. ఆ పాట రాసిన జొన్నవిత్తులకి థ్యాంక్స్‌. అజనీష్‌ లోకనాథ్‌ తన మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నితిన్‌ గత కొన్ని చిత్రాలు సక్సెస్‌ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ ‘తమ్ముడు’ ఆయనకు కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మా బ్యానర్‌కు మరో హిట్‌ ఈ సినిమా ఇవ్వబోతోంది. రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేశాం. చరణ్‌తో సూపర్‌ హిట్‌ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే ఆయనతో ఓ సూపర్‌ హిట్‌ మూవీ చేయబోతున్నాం’ అని అన్నారు.
హీరో నితిన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా శ్రీరామ్‌ వేణు కోసం, నా సినిమాలను ఇష్టపడే అభిమానులు, నాకు సక్సెస్‌ రావాలని కోరుకునేవారి కోసం ఘన విజయం సాధించాలి. నా గత చిత్రాలు మీకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ఈ సినిమా తప్పకుండా సంతోషపెడుతుంది. నా గత సినిమాలు నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్‌తో మీ ముందుకు వస్తానని ప్రామిస్‌ చేస్తున్నా. ఇది థియేట్రికల్‌గా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్‌
ఇచ్చే సినిమా’ అని తెలిపారు.
‘నాకంటే ఈ సినిమాను ఎక్కువగా నమ్మిన వ్యక్తి శిరీష్‌. ఈ సినిమాను థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం డిజైన్‌ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్‌గా ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. వారు నాపై పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుం టున్నాను. హీరో నితిన్‌ ఈ సినిమా కోసం ప్రతి విషయంలో అన్‌ కండీషనల్‌గా సపోర్ట్‌ చేశారు. నేను అనుకున్న క్యారెక్టర్‌ను ఎంతో బాగా పర్‌ఫార్మ్‌ చేశాడు. ఓ మంచి సినిమాతో వస్తున్నాం’ అని డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -