మూడు నెలలుగా తగ్గుదల..
నవతెలంగాణ – అశ్వారావుపేట : జూన్ నెల టన్ను పామాయిల్ గెలలు ధర ను రూ.17,463 లుగా ఆయిల్ ఫెడ్ అధికారులు మంగళవారం ఖరారు చేశారు. మే నెల టన్ను గెలలు ధర రూ.18,748లు ఉండగా.. జూన్ లో టన్నుకి రూ.1,285లు తగ్గుదల కనిపిస్తుంది. ఈ ఏడాది (2025) గడిచిన జనవరి, ఫిబ్రవరి, మార్చి.. ఈ మూడు నెలలు టన్ను గెలలు ధర రూ.20 వేలు పైగానే పలికింది. అయితే ఏప్రియల్, మే, జూన్ నెలలు ధరలు రూ.20 వేలు లోపు తగ్గుముఖం పట్టాయి.
నెల ధర వ్యత్యాసం
డిసెంబర్( 24) 20506 ——–
జనవరి (25) 20487 + 19
ఫిబ్రవరి 20871 + 384
మార్చి 21000 +129
ఏప్రియల్ 20058 – 942
మే 18748 – 1310
జూన్ 17463 – 1285
ఈ గెలల ధరలు పెరిగినప్పుడు రూపాయల్లో తగ్గినప్పుడు వేలల్లో తగ్గడం గమనార్హం.