Thursday, July 3, 2025
E-PAPER
HomeNewsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు3 లక్షల ఇండ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం ఒకటి. రాష్ట్రంలోని అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లను కట్టించి ఇస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి కీలక విషయాలు వెల్లడించారు. వీటిల్లో 2.37 లక్షల ఇళ్లకు ఇప్పటికే మంజూరు పత్రాలు అందించామన్నారు. మరో 1.23 లక్షల ఇళ్లు నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రూ. 5 లక్షలతో ఇళ్లను నిర్మించి ఇవ్వట్లేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 23వ తేదీ నాటికి జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన 95 నియోజకవర్గాలకు గాను 88 అసెంబ్లీ స్థానాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ జిల్లాలలో పనితీరు ఇంకా మెరుగుపడాలని ఈ మేరకు అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -