Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకూలిన గుడిసె.. ఇందిరమ్మ ఇల్లుకోసం అభ్యర్థన

కూలిన గుడిసె.. ఇందిరమ్మ ఇల్లుకోసం అభ్యర్థన

- Advertisement -


నవతెలంగాణ – గాంధారి 
: గాంధారి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎస్సీ కాలనీలోని బసలలిత పూరి గుడిసె రాత్రికి వచ్చిన వర్షానికి కూలిపోయింది. ఈ సందర్భంగా బాదితురాలు మాట్లాడుతూ.. ఉండడానికి ఇల్లు లేదని, ఉన్న పూరిగురిసే వర్షానికి కూలిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చాలాసార్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం తన కోడలు పేరుమీద దరఖాస్తు చేశామని అన్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదని, తనకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవని తెలిపారు. గ్రామపంచాయతీలో కార్మికురాలుగా పనిచేస్తున్నానని, ప్రభుత్వం తక్షణమే తమ కుటుంబాన్ని ఆదుకుని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -